- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,326 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో, భారత్ లో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,46,53,592కి పెరిగిందని, అయితే యాక్టివ్ కేసులు 17,912కి తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఎనిమిది మరణాలతో మరణాల సంఖ్య 5,29,024కి చేరుకుందని పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.78 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 1723 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.59 శాతంగా నమోదైందని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 219.63 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు పంపిణీ చేసినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
- Advertisement -