న్యూఢిల్లీ : దేశంలో బుధవారం 6.56 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 13,313 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇన్ని రోజులూ 12 వేలకు నమోదైన కేసులు తాజాగా పెరిగాయి. పాజిటివిటీ రేటు 2.03 శాతానికి చేరింది. ఒక్క కేరళ లోనే నాలుగు వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. మహారాష్ట్రలో మూడు వేలకు పైగా కేసులు రాగా, ఢిల్లీలో ఆ సంఖ్య వెయ్యి దిగువకు చేరింది. ముంబైలో పాజిటివిటీ రేటు 20 శాతానికి చేరి ఆందోళన కలిగిస్తోంది. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 4.33 కోట్ల మందికి మహమ్మారి సోకింది. ఇన్‌ఫెక్షన్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 83,990 కి పెరిగాయి. క్రియాశీల రేటు 0.19 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.60 శాతానికి పడిపోయింది. బుధవారం 10,972 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 38 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. తాజాగా మరణాల సంఖ్యలో పెరుగుదల కన్పిస్తోంది. ఇక బుధవారం 14.91 లక్షల మంది టీకా తీసుకోగా, మొత్తం 196 కోట్లకు పైగా డోసులు పంపిణీ పూర్తి చేసినట్టు కేంద్రం తెలిపింది.
మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -