- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,918 మంది బాధితులు కోలుకున్నారు. భారత్ లో ప్రస్తుతం 13,672 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసులును కలుపుకుని మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,30,25,775కి పెరిగింది. 52 తాజా మరణాలతో మరణాల సంఖ్య 5,21,181కి చేరుకుంది. భారత్ లో కోవిడ్ రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4,24,90,922కి పెరిగింది. అయితే మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 184.31 కోట్ల మందికి కోవిడ్ టీకాలు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
- Advertisement -