హైదరాబాద్ం తెలంగాణలో 134 బిసి కులాలకు సిఎం కెసిఆర్ పాలనలో మేలు జరిగిందని ఎంఎల్ సి వి గంగాధర్ గౌడ్ తెలిపారు. టిఆర్ఎస్ భవనం నుంచి గంగాధర్ మీడియాతో మాట్లాడారు. దేశంలో మరెక్కడా చేతి వృత్తులకు ఇంతటి ఆదరణ లభించలేదన్నారు. గొల్ల కురుమలకు 10 వేల కోట్ల రూపాయల తో గొర్లు కేటాయించిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. కొందరు పార్టీ మారక సిఎం కెసిఆర్ పై బురద జల్లుతున్నారని, బిసి గురుకులాలకు కేంద్రం నయా పైసా ఇచ్చింది లేదన్నారు. ప్రతి గురుకుల విద్యార్థిపై కెసిఆర్ ప్రభుత్వం లక్షా 20 వేల రూపాయలు ఇచ్చిందని, కెసిఆర్ ఇంతా చేస్తున్నా ప్రతిపక్షాలు రాజకీయం కోసమే బిసిలకు ఏం చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నాయని గంగాధర్ గౌడ్ మండిపడ్డారు. బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రజలు కెసిఆర్ పథకాలను బాగున్నాయన్న విషయం గుర్తు చేశారు. కెసిఆర్ పై బురద జల్లే నేతలను మునుగోడు ప్రజలు పట్టించుకోవదన్నారు.
134 బిసి కులాలకు మేలు జరిగింది: గంగాదర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -