- Advertisement -
న్యూఢిల్లీ : త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా, నౌకాదళంలో 13,537 , వాయుసేనలో 5723 ఖాళీలు ఉన్నాయని తెలియజేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుల్లో ఏటా సగటున భర్తీలు 60 వేలు, 5332,5723 గా ఉన్నట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్ వెల్లడించారు. రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు ఆయన ఈమేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. సగటు నియామకాల సంఖ్య, అగ్నివీరుల భర్తీ సంఖ్య కంటే ఎక్కువగా ఉందా ? అలా అయితే , సాయుధ దళాల్లో సిబ్బంది కొరతను ఎలా తీరుస్తారు ? అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం దాటవేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని బదులిచ్చారు.
- Advertisement -