న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,596 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఒక రోజులో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం గత 230 రోజుల్లో (సుమారు 8 నెలలు) ఇదే మొదటిసారని పేర్కొంది. ఇక, నిన్న ఒక్కరోజు కరోనాతో 166 మంది మృతిచెందారని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా సోకినవారి సంఖ్య 3.40కోట్లకు చేరింది.
గత 24 గంటల్లో కరోనా నుంచి 19,582 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 3.34కోట్లకు పైగా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో దేశవ్యాప్తంగా 4.52మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,89,694మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 97.79కోట్ల కరోనా డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ పేర్కొంది.
13596 New Corona Cases Reported in India