Friday, April 4, 2025

బీబీనగర్ ఎయిమ్స్‌కు రూ.1365 కోట్లు : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : బీబీనగర్‌లోని ఎయిమ్స్ భవన నిర్మాణాలకు రూ.1365 కోట్లు విడుదల చేశారని కేంద్ర పర్యాటక శాఖ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ట్వీటర్ వేదికగా వివరాలు వెల్లడించారు. బీబీనగర్ ఎయిమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని పేర్కొన్నారు. 750 పడకల ఆస్పత్రి భవనం, 30 పడకల ఆయుష్ బ్లాక్ నిర్మాణంతో పాటు వైద్యకళాశాలలో 100 సీట్లు,- నర్సింగ్ కాలేజీలో 60 సీట్లు విద్యార్థులకు కేటాయించారని తెలిపారు. ఎయిమ్స్‌లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతవాసులకు నాణ్యమైన, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యను అందిస్తాయని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News