Sunday, December 22, 2024

వయనాడ్‌లో జాడ తెలియని 138 మంది

- Advertisement -
- Advertisement -

వారం పైగా క్రితం ఉత్తర కేరళలోని వయనాడ్ జిల్లాలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడి సృష్టించిన విలయంలో 138 మంది వ్యక్తులు గల్లంతు అయ్యారని స్థానిక అధికార యంత్రాంగం బుధవారం విడుదల చేసిన ప్రాథమిక గణాంకాల ద్వారా తెలుస్తున్నది. విపత్తు బాధిత ప్రాంతాల్లో రేషన్ కార్డులు, వోటర్ రికార్డుల ఆధారంగా గల్లంతైన 138 మంది వ్యక్తుల ముసాయిదా జాబితా రూపొందించినట్లు జిల్లా అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలియజేసింది.

‘గ్రామ పంచాయతీ, ఐసిడిఎస్, జిల్లా విద్యా శాఖ కార్యాలయం. లేబర్ ఆఫీస్, జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వద్ద గల అధికార రికార్డుల సంకలనం నుంచి గల్లంతైనవారి జాబితా రూపొందించాం’ అని జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది. సహాయ శిబిరాలు, బంధువుల వద్ద నివసిస్తున్న లేదా ఆసుపత్రిలో చేరిన, మరణాల నిర్ధారణ జరిగిన వారి పేర్లను ఆ జాబితా నుంచి తొలగించినట్లు అధికార యంత్రాంగం తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News