Monday, December 23, 2024

కరెంట్ వాడకంలో రికార్డు

- Advertisement -
- Advertisement -

13,857 MW consumption in single day

సోమవారం ఒక్కరోజే 13,857 మెగావాట్ల వినియోగం

రాష్ట్ర చరిత్రలో ఇదే అధిక డిమాండ్ 16వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా తట్టుకోగలం : ట్రాన్స్‌కో జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రోజురోజుకు తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరాతో ఇది మరింత అధికమవుతోంది. రాష్ట్రంలో సోమవారం ఆల్ టైం రికార్డును విద్యుత్ డిమాండ్ సృష్టించింది. ఈ విషయాన్ని ట్రాన్స్ కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు ప్రకటించారు. సోమవారం 3.54 నిమిషాలకు ఏకంగా 13,857 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యధిక విద్యుత్ డిమాండ్ అని, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే అధిక విద్యుత్ వినియోగంగా నమోదయ్యిందని ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం 13,742 మెగావాట్ల అధిక విద్యుత్ డిమాండ్ నమోదు కాగా సోమవారం 13,857 మెగావాట్లు గా నమోదైదయ్యిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వ్యవసాయ రంగం, పరిశ్రమల స్థాపన, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతోనే విద్యుత్ డిమాండ్ పెరిగిందని ఆయన తెలిపారు.ఈ నెలలో విద్యుత్ వినియోగం అంతకంతకు పెరగడం ఇది మూడోసారి అని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా విద్యుత్ వినియోగంలో తెలంగాణ దూసుకెళుతోందని, రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యధిక విద్యుత్ డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే 14,000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్‌కు చేరవచ్చని, వేసవికాలం పూర్తయ్యేలోగా 16,000 మెగా వాట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ వచ్చిన సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు పని చేస్తాయని ట్రాన్స్ కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News