Tuesday, November 5, 2024

కాజీపేట రైల్వేస్టేషన్‌లో 14.5 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -
  • ఒకరు అరెస్ట్

కరీంనగర్ రూరల్: వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, ఎక్సైజ్ సూపర్డెంట్ చంద్రశేఖర్‌ల ఆదేశాల మేరకు సోమవారం రాత్రి కాజీపేట రైల్వేస్టేషన్లోని చివరి ప్లాట్ఫామ్ వద్ద ఒక అనుమానిత వ్యక్తి నుండి సుమారు నాలుగు లక్షల విలువ చేసే 14.5 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిపై కేసు చేసి రిమాండ్ పంపించామని కాజీపేట సిఐ చంద్రమోహన్ తెలిపారు.

వివరాల్లోకి వెళితే ఎన్నికల కోడ్ను దృష్టిలో ఉంచుకొని గత 20 రోజుల నుండిగా ఇంటలిజెన్స్ ఆధారంతో పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్న సందర్భంగా, నిన్న రాత్రి పక్కాగా అందిన సమాచారం మేరకు కాజీపేట రైల్వేస్టేషన్లో రాత్రి సోదాలు నిర్వహించగా అనుమానితంగా కనిపించినటువంటి ఒక వ్యక్తి అధికారులను చూసి పారిపోవు ప్రయత్నాన్ని అడ్డగించి, అతని వద్ద ఉన్నటువంటి బ్యాగులో చూడగా అతని వద్ద సుమారు నాలుగు లక్షల విలువచేసే 14.5 కిలోల ఎండు గంజాయి దొరికిందని సీఐ తెలిపారు. ఇట్టి వ్యక్తి ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి వ్యక్తి గత కొంతకాలంగా విజయవాడ నుండి కొనుగోలు చేసి వీరికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడ డెలివరీ చేయమంటే అక్కడ డెలివరీ చేస్తాడని, ఇట్టి డబ్బులకు ఆశించి ఇతను గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడని సీఐ తెలిపారు.

ఇట్టి వ్యక్తి విజయవాడ నుండి బయలుదేరి రాత్రి కాజీపేటలో దిగి, తిరిగి ఖరగ్పూర్ ఎక్స్ప్రెస్ లో ఖరగ్పూర్ చేరుకోవడానికి కాజీపేట రైల్వే స్టేషన్ లో ఆగి ఉండగా ఎక్సైజ్ పోలీసులకు పట్టు పడినట్లు సీఐ తెలిపారు. అలాగే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఎవరైనా గంజాయిని అమ్మిన, రవాణా చేసిన , అలాగే సుంకం చెల్లించినటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మద్యాన్ని తెచ్చిన, అలాంటి మధ్యాన్ని డంపు చేసిన అలాగే పెద్ద మొత్తంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి పెద్ద మొత్తంలో మద్యాన్ని డంపు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు.

అలాగే ఆ మద్యం దుకాణదారులు, ఎక్సైజ్ ఆక్ట్ ప్రకారం నడుచుకోవాలని, ఎక్సైజ్ నిబంధనలు ఉల్లంఘించరాదని వారికి సూచించారు. గడచిన మూడు రోజుల వ్యవధిలో సుమారు 20 లక్షల విలువ చేసే ఎండు గంజాయి, నల్ల బెల్లం పట్టికను అలాగే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు.ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్త్స్రలు తిరుపతి, సౌమ్య, హెడ్ కానిస్టేబుల్ ఖలీల్, కోటిలింగం, వీరమల్లు, రషీద్, లాలయ్య, వెంకటరమణ, రవీందర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News