గువాహటి: అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడాన్ని సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 14 మంది వ్యక్తులను అస్సాంలోని వివిధ ప్రాంతాలలో అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, సిఆర్‌పిసిలోని వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసి శుక్రవారం రాత్రి నుంచి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై ఒక కన్నేసి ఉంచామని, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. కామరూప్, మెట్రోపాలిటన్, బార్పేట, దుభ్రి, కరీంగంజ్ జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున అదుపులోకి తీసుకున్నట్లు వారు చెప్పారు. దర్రంగ్, కచోర్, హైలాకండి, దక్షిణ సల్మారా, గోల్‌పరా, హోజల్ జిల్లాల నుంచి ఒకరి చొప్పున అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
తాలిబన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 14 మంది అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -