Friday, December 20, 2024

ఢిల్లీ హనుమజ్జయంతి అల్లర్లు… 14 మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

14 arrested in Delhi Hanuman Jayanti riots

న్యూఢిల్లీ : హనుమజ్జయంతి సందర్భంగా వాయువ్య ఢిల్లీ జహంగీర్‌పురిలో నిర్వహించిన శోభాయాత్ర సందర్భంగా చెలరేగిన హింసాత్మక సంఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు ఆదివారం చెప్పారు. శనివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి పరస్పర దాడులకు దిగి ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు రువ్యారు. రాళ్ల దాడిలో దుకాణాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. సాధారణ పౌరులతోపాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు తుపాకీ తూటా తగిలి తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం ఎనిమిది మంది పోలీసులు, ఒక పౌరుడు గాయపడ్డారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా రంగ్‌నాని చెప్పారు. ఆదివారం ఉదయం జహంగిర్‌పురి ప్రాంతంలో భారీగా పోలీస్ దళాలను మోహరింప చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News