Monday, January 20, 2025

జార్ఖండ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 14మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

ధన్‌బాద్: జార్ఖండ్ ధన్‌బాద్‌లోని ఓ అపార్టుమెంటులో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 14మంది సజీవ దహనమయ్యారు. అపార్టుమెంటు భవనంలో చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు రెస్కూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, పదిమంది మహిళలు ఉన్నటు ప్రాథమిక సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ సందీప్‌సింగ్ తెలిపారు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని వివరాలను పరిశీలించాల్సి ఉంది.

ప్రమాదంలో 12మంది తీవ్రంగా గాయపడ్డారని ధన్‌బాద్ ఎస్‌ఎస్‌పి సంజీవ్‌కుమార్ తెలిపారు. ధన్‌బాద్‌లోని దేవాలయం సమీపంలో ఉన్న ఆశీర్వాద్ టవర్‌లో అగ్నిప్రమాదం జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. 18మందిని ప్రమాదం నుంచి రక్షించి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగో అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లో వివాహం జరుగుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది.

కాగా నాలుగు రోజుల వ్యవధిలో ధన్‌బాద్‌లో అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారి. శనివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వైద్యుల దంపతులతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిప్రమాదంలో బాధితులు ప్రాణాలు కోల్పోవడంపై జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News