Friday, December 20, 2024

14 మంది పిల్లలకు కరెంట్ షాక్

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌లో మహాశివరాత్రి నాడు ఘోర ప్రమాదం జరిగింది. వేడుకలు, భక్తి నడుమ ప్రమాదవశాత్తూ 14 మంది పిల్లలు కరెంటు షాక్‌కు గురయ్యారు. రాజస్థాన్‌లోని కోటలో ఈ ఘటన జరిగింది. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. షాక్‌కు గురైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి మీరాలాల్ నాగర్ తెలిపారు. శివరాత్రి జాతర ప్రాంతంలో హైటెన్షన్ వైర్లు వల్లనే విద్యుత్ షాక్ ఘటన జరిగిందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News