Wednesday, January 22, 2025

రామాలయ ప్రాణ ప్రతిష్టలో యజమానులుగా 14 జంటలు

- Advertisement -
- Advertisement -

అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో ఈనెల 22న జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని వివిధ భాగాలకు చెందిన 14 జంటలు యజమానులుగా వ్యవహరించనున్నాయి. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో అనేక క్రతువులు ఉంటాయని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అకిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ శనివారం తెలిపారు. రామాలయంలో 22న జరిగే ప్రధాన ప్రాణ ప్రతిష్ట పూజలో దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ, ్దక్షిణ, ఈశాన్య భాగాలకు చెందిన 14 మంది దంపతులు ముఖ్య యజమానులుగా పాల్గొంటారని ఆయన చెప్పారు. యజమానుల జాబితాలో ఉదయ్‌పూర్ నుంచి రామచంద్ర ఖరడి, అస్సాం నుంచి రామ కుయి జెమి, జైపూర్ నుంచి గురుచరణ్ సింగ్ గిల్, హర్దోయి నుంచి కృష్ణ మోహన్,

ముల్తానీ నుంచి రమేష్ జైన్, తమిళనాడు నుంచి అదాలరసన్, మహారాష్ట్ర నుంచి విఠల్ రాము కాల్లే, మహారాష్ట్ర లాటూర్‌లోని ఘుమంతు సమాజ్ ట్రస్టు నుంచి మహదేవ్ రావు గైక్వాడ్, కర్నాటక నుంచి లింగరాజ్ బసవరాజ్, లక్నో నుంచి దిలీప్ వాల్మీకి, దోమ్ రాజా కుటుంబం నుంచి అనిల్ చౌదరి, కాశీ నుంచి కైలాశ్ యాదవ్, హర్యానాలోని పల్వాల్ నుంచి అరుణ్ చౌదరి, కాశీ నుంచి కవీంద్ర ప్రతాప్ సింగ్ ఉన్నారు. వీరంతా సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. మత గ్రంథాలలో పేర్కొన్న విధంగా సమగ్రంగా పూజలు జరుగుతాయని అంబేకర్ తెలిపారు. శ్రీరాముడి జన్మభూమిలో ఆలయ నిర్మాణం జరగాలని దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన కోరుకున్నారని, అందుకోసం అనేక మంది పోరాడారని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు, ప్రచారాలలో అనేక మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు.

ఇదో చారిత్రాత్మక ఘట్టం కాబట్టి దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆలయంతో మమేకం కావాలని భావిస్తున్నారని ఆయన వివరించారు. ఇది భారతదేశానికి చెందిన ఉత్సవమని, హిందూ సమాజానికి సమైక్యతా ఉత్సవమని ఆయన అభివర్ణించారు. రామాలయ ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవానికి ముందు జనవరి 16నుంచి ఆలయంలో వివిధ క్రతువులు జరుగుతున్నాయి. శనివారం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పుష్పాలు, చక్కెరతో రామ్ లల్లా విగ్రహానికి పుష్పాధివాస్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ పుణ్య క్షేత్రాల నుంచి సేకరించిన జలాలతో రామ్ లల్లా విగ్రహానికి అభిషేకం, ఆలయ శుద్ధి జరిగాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News