Thursday, January 23, 2025

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా..ఇద్దరి పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

వాజేడు : ఆటో బోల్తా పడి 14 మంది కూలీలు గాయాపడిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఏటూరునాగారం మండలం దొడ్ల కొత్తూరు గ్రామానికి చెందిన కూలీలు వాజేడు మండలంలోని ఓ రైతు మిర్చి కోతల పని కోసం ఆటో లో వెళ్తుండగా జగన్నాధపురం గ్రామం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మోదని వెన్నెల, సొగలం రవి, సబక సీత, సొగలం రామి, సామల సాంబి, మార శ్రీను, కోగిల కుమారి, సబక రమేష్, సోయం ఓంగి,

సోలం మోతే లకు తీవ్ర గాయలవగా దొడ్డి సుక్లి, సోడి దూలయ్య, పూనెం శ్రీను, సబక మంగ లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న స్థానికులు ఆటో యూనియన్ సభ్యులు హూటహూటిన క్షతగాత్రులను వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వాజేడు ఎస్సై కొప్పుల తిరుపతి రావు ప్రమాదానికి గల కారణాలు సేకరించారు. క్షతగాత్రులకు వాజేడు వైద్యశాలలో చికిత్సనందించి మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News