Sunday, December 22, 2024

నవనీత్ రాణా దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

14 days judicial custody for Navneet Rana couple

ముంబై : మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్‌ఎల్‌ఎ రవి రాణా దంపతులకు మరోషాక్ తగిలింది. శనివారం పోలీసులు వీరిని అరెస్టు చేయగా, ఇరువురికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ బాంద్రా లోని మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. దీంతో రెండు వారాల పాటు వారు జైలు జీవితం గడపనున్నారు. మతకలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ నవనీత్ రాణా దంపతులను ముంబై పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఐపీసీ సెక్షన్ 153 ఎ కింద వీరిపై కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఇంటిముందు హనుమాన్ చాలీసా పఠించి తీరుతామని నవనీత్ రాణా దంపతులు సవాలు విసిరారు.

అయితే ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ శివసేన పార్టీ కార్యకర్తలు ఎంపీ ఇంటి ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో నవనీత్ దంపతులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. రవిరాణా మాట్లాడుతూ రేపు ముంబైకి ప్రధాని మోడీ రానుండటంతో తమ నిరసనలపై వెనక్కి తగ్గుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కారణంగా ప్రధాని పర్యటనకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే నవనీత్ దంపతులు విసిరిన సవాలు మత కలహాలకు దారి తీసేలా ఉందంటూ ముంబై పోలీసులు వారిని అరెస్టు చేశారు. శుక్రవారమే నోటీసులు కూడా జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News