Wednesday, January 22, 2025

ప్రజ్వల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: లైంగిక దాడి, లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన జేడీ (ఎస్) మాజీ నేత, మాజీ ఎంపీ, ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసిన ప్రజ్వల్ కస్టడీ సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కోర్టు14 రోజుల పాటు అంటే జులై 8 వరకు కస్టడీని పొడిగించింది.

ఇదిలా ఉండగా ప్రజ్వల్ బెయిల్ పిటిషన్ అదనపు సిటీ సివిల్ సెషన్స్ జడ్జి ముందుకు రాగా, ఆ ఉత్తర్వులను జూన్26 కు కోర్టు రిజర్వు చేసింది. ప్రజ్వల్ రాసలీలలు వెలుగు లోకి రావడంతో కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది. దీంతో ప్రజ్వల్ జర్మనీకి పరారయ్యాడు. మే 31న జర్మనీ నుంచి వచ్చిన ప్రజ్వల్‌ను బెంగళూరు ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మాజీ ప్రధాని దేవగౌడ పెద్ద కుమారుడు హెచ్‌డి రేవణ్ణ కుమారుడే ఈ ప్రజ్వల్ రేవణ్ణ .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News