- Advertisement -
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ మెజిస్ట్రేట్ కోర్టు 14 రిమాండ్ విధించింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్రమణ్యంను తానే చంపినట్టు అనంతబాబు అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్ లో అనంతబాబుకు వైద్య పరీక్షల అనంతరం రిమాండ్ నిమిత్తం మెజిస్ట్రేట్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీంతో కేసు విచారించిన కాకినాడ మెజిస్టేట్ 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు రాత్రి 1.15 గంటల సమయంలో అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మే 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు హత్యచేసి మృతదేహాన్ని కారులో ఉంచి వదిలి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబీకులు ఆందోళనకు దిగాయి. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదైంది.
- Advertisement -