Wednesday, January 22, 2025

మాజీ ఎంఎల్‌ఎ అరెస్టు

- Advertisement -
- Advertisement -

కెటిఆర్ ఆదేశాలతోనే దాడికి యత్నం

నేరాంగీకార వాంగ్మూలంలో పట్నం నరేందర్‌రెడ్డి కలెక్టర్‌పై దాడి కేసులో
హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు వికారాబాద్‌కు తీసుకెళ్లి
విచారణ కోర్టు ఎదుట హాజరు…14రోజులు రిమాండ్
విధించిన న్యాయమూర్తి..చర్లపల్లి జైలుకు తరలింపు రిమాండ్
రిపోర్టులో ఎ1గా పట్నం నరేందర్‌రెడ్డి పేరు ప్రభుత్వాన్ని
అస్థిరపరిచేందుకు కుట్ర పన్నినట్లు అభియోగం.. అవసరమైతే
అధికారులను చంపడానికి సైతం వెనుకాడకూడదని నిర్ణయించినట్లు
ఆరోపణ ప్రభుత్వంతో పోరాటం ఆగదు : పట్నం నరేందర్‌రెడ్డి నినాదం

హైదరాబాద్‌లో అరెస్టు చేసి వికారాబాద్‌కు తీసుకెళ్లిన పోలీసులు కోర్టు ఎదుట 14రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి,
చర్లపల్లి జైలుకు తరలింపు రిమాండ్ రిపోర్టులో ఎ1గా పట్నం నరేందర్‌రెడ్డి.. కెటిఆర్ పేరును ప్రస్తావించిన పోలీసులు ఆయన ఆదేశానుసారమే దాడికి
పథకం రూపొందించానని నేరం అంగీకరించినట్లు స్పష్టీకరణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నినట్లు అభియోగం
అవసరమైతే అధికారులను చంపడానికి వెనుకాడకూడదని ఆరోపణ

మన తెలంగాణ/వికారాబాద్/కొడంగల్/ దౌల్తా బాద్/హైదరాబాద్: జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం, లగచర్ల గ్రామం లో రెండు రోజుల క్రితం కలెక్టర్, అధికారులపై దా డి ఘటన నేపథ్యంలో మాజీ ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుసరిస్తున్నారు. ప్రధాన నిందితుడైన సురేష్, ఏ1 ముద్దాయి నరేందర్ రెడ్డితో 42 సార్లు ఫోన్ చేసి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అ ధికారులపై దాడి చేసేందుకు ముందు నుంచే పథ కం పన్నారని, ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్, అధికారులను సమావేశ చర్చావేదిక దగ్గర కాకుండా

గ్రామంలోకి బలవంతంగా సురేశ్ ఆహ్వానించాడని గుర్తించారు. గ్రామానికి వెళ్లగానే ప్రజలు అధికారులపై రాళ్లు, కట్టెలు, కర్రలతో ఎదురుతిరిగారు. ఈ సందర్భంగా అధికారులపై దాడి చేయడం కాకుం డా అధికారుల కార్లను రాళ్లు, కర్రలతో ధ్వంసం చే శారు. ఈ సంఘటన అనంతరం బుధవారం హైదరాబాద్‌లో కొడంగల్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం న రేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించి విచారణ జరిపారు. విచారణకు ఐజి సత్యనారాయణ, వికారాబాద్ ఎస్‌పి నారాయణరెడ్డి ఆయనను సుదీర్ఘంగా విచారణ జరిపారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కొడంగల్ కోర్టుకు తరలించి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు మాజీ ఎంఎల్‌ఎను చర్లపల్లి జైలుకు తరలించారు.

రిమాండ్ రిపోర్టులో కెటిఆర్ పేరు
మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డిని రిమాండ్ రిపోర్టులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ పేరును పోలీసులు ప్రస్తావించారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఎ1 నిందితుడిగా పట్నం నరేందర్‌రెడ్డిని చేర్చారు. తమ పార్టీ కీలక నేత కెటిఆర్ ఆదేశానుసారం ఈ దాడికి పథ కం పన్నినట్లు పట్నం నరేందర్ రెడ్డి నేరాంగీకార పత్రంలో అంగీకరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వా న్ని అస్థిర పరిచేందుకు పథకం ప్రకారం కుట్ర జరిగిందని వెల్లడించారు. అవసరమైతే అధికారులను చంపేందుకు సైతం వెనుకాడకూడదని నిందితుల కు కుట్రదారుల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు రిమాం డ్ రిపోర్టులో పేర్కొన్నారు. మొదట ఈ దాడి ఘటనలో ఎ2గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్ రెడ్డిని ఎ1గా మార్చినట్లు పోలీసు లు వెల్లడించారు. ఎ2గా చేర్చిన సురేశ్ పలుమార్లు పట్నం నరేందర్‌రెడ్డితో సంభాషించినట్లు రు. దాడి జరిగిన రోజు, దాడికి ముందు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సురేశ్ నరేందర్‌రెడ్డికి వివరించినట్లు తెలిపారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని, వీరు ఇంకా ఎవరెవరితో సంభాషించారన్న సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు.

వికారాబాద్ కలెక్టరేట్‌లో మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అన్ని ఆధారాలతోనే కొ డంగల్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డి ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. లగచర్ల దాడి ఘటనలో మొత్తం 47 మందిని గు ర్తించామని, ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉం దన్నారు. ఈ దాడి ఘటనతో సంబంధం ఉన్న ప రారీలో ఉన్న నిందితుల కోసం 4 బృందాలతో గా లింపు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన 21 మందిని జ్యూడిషియల్ రిమాండ్‌కు పం పించినట్లు తెలిపారు. ఈ ఘటనలో మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డి, విట్టల్, దేవదాస్, గోపాల్ నాయక్, సురేష్, రాజు, విజయ్ ప్రధాన సూత్రధారులుగా దర్యాప్తులో తేలిందన్నారు. ఇప్పటివరకు 42 మందిని ప్రాథమికంగా విచారించగా, వీరిలో 19 మందికి భూమి లేదని తేలిందని ఐజి స త్యనారాయణ వివరించారు. భూసేకరణ బాధితు లు కాకపోయినప్పటికీ వారు లగచర్ల దాడి ఘటనలో పాల్గొన్నాట్లు తెలిపారు. కుట్రలో భాగంగా ముందస్తు ప్రణాళికతో కలెక్టర్, పోలీస్ అధికారులపై దాడి చేశారని వెల్లడించారు.

నరేందర్ రెడ్డి పాత్ర
‘లగచర్లలో జరిగిన దాడిలో బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకం. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశాం. గురువారం నరేందర్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వడం పై కోర్టులో వాదనలు జరుగుతాయి. ఈ కేసులో మొదట ఎ1గా ఉన్న సురేశ్‌ను ఎ2గా మార్చాం. పూర్తి ఆధారాలు దొరకడంతోనే నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి ప్రధాన కుట్రధారుగా నరేందర్ రెడ్డిగా గుర్తించడంతో లగచర్లలో అధికారులపై దాడి కేసులో బిఆర్‌ఎస్ నేతను ఎ1 గా మార్చాం. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ పై దా డి చేశారు. ఈ దాడిలో సురేష్ కీలక పాత్ర పోషించాడు’ అని – ఐజీ సత్యనారాయణ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News