Wednesday, April 2, 2025

పోసానికి 14 రోజుల రిమాండ్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ నటుడు, వైసిపి సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలిం చారు. కులాలు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా గతంలో కామెంట్లు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసానికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోట్లు రెండు వారాల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇరువైపుల వాదనలు కొనసాగాయి. బిఎన్‌ఎస్ బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అందుకు మేజిస్ట్రేట్ నిరాకరించి, 14 రోజుల రిమాండ్ విధించారు. మార్చి 12 వరకు రిమాండ్ లో ఉండను న్నారు. మేజిస్ట్రేట్ రిమాండ్ విధించిన అనంతరం పోలీసులు పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. పోసానిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News