Sunday, November 3, 2024

తమిళనాడులో దారుణం.. కల్తీ మద్యంతో 14మంది మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులో రెండు వేర్వేరు ఘటనల్లో కల్తీ మద్యం సేవించిన ఘటనల్లో మృతుల సంఖ్య 14కు చేరింది. 51మంది ఆసుపత్రి పాలయ్యారు. విల్లుపురం జిల్లా మరక్కానంలో తొమ్మిది మంది, చెంగల్‌పట్టు జిల్లా మదురాంతకం వద్ద కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందారు . విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు నార్త్ జోన్ ఐజీ కన్నన్ తెలిపారు. కల్తీ మద్యం, గుట్కా తయారు చేసి సరఫరా చేసిన 9 మందిని పోలీసులు 57 కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

పుదుచ్చేరి నుంచి అక్రమంగా కల్తీసారా తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అమరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనితోపాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మరికొంత మంది పరారీలో ఉన్నారని.. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు వెల్లడించారు. మృతి చెందిన వారు ఇండస్ట్రియల్ మిథనాల్ మికస్డ్ కల్తీ మద్యం సేవించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు విల్లుపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిఎం స్టాలిన్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనలపై సిబిసిఐడి విచారణకు ఆదేశించినట్లు మీడియాకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News