Monday, December 23, 2024

ఆబ్కారీ శాఖలో సరికొత్తగా మరిన్ని ఎక్సైజ్ స్టేషన్‌ల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏర్పాటు ?
స్టేషన్ల విభజన పూర్తి అనంతరం
సిబ్బంది, అధికారుల బదిలీ
త్వరలోనే ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్

14 Excise Stations in Excise Department

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వానికి అధిక ఆదాయం తెస్తున్న ఆబ్కారీ శాఖలో సరికొత్తగా మరిన్ని ఎక్సైజ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా దానికి సంబంధించిన ఫైల్‌ను ప్రభుత్వానికి ఆ శాఖ ఉన్నతాధికారులు పంపించినట్టుగా తెలిసింది. ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రక్రియను ఏప్రిల్ నెలలో క్లియర్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. స్టేషన్ల విభజన పూర్తి చేసిన తర్వాత అధికారులు, సిబ్బందిని బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మొత్తం 14 కొత్త స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. వీటిలో జీహెచ్‌ఎంసి పరిధిలోనే 12 ఏర్పాటు చేయనున్నారు. ఎక్కువ ఆదాయం రావడంతో పాటుగా పరిధి ఎక్కువగా ఉన్న స్టేషన్ల నుంచి కొత్త స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. ఈ విభజన అనంతరం చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులతో పాటు బదిలీలను చేపట్టే అవకాశం ఉంటుందని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

త్వరలోనే జిఓ జారీ

గ్రేటర్ పరిధిలో శంషాబాద్, సరూర్‌నగర్, హయాత్‌నగర్, ఉప్పల్, ఘట్‌కేసర్, మల్కాజిగిరి, అమీర్‌పేట, నాంపల్లి, జూబ్లీహిల్స్, మలక్‌పేట, కుత్బుల్లాపూర్, లింగపల్లిలో కొత్త స్టేషన్లు ఏర్పాటు కానుండగా, పఠాన్‌చెరు స్థానంలో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా హన్మకొండ జిల్లా హన్మకొండలో మరో స్టేషన్ కొత్తగా రానుంది. ఏప్రిల్ మొదటివారంలో ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఆ తర్వాత బదిలీలు చేయనున్నారు. కొత్త స్టేషన్ల ఏర్పాటుపై ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు నివేదికను సిద్ధం చేసినట్టుగా సమాచారం. త్వరలోనే వీటిని ఫైనల్ చేసి, జీఓ జారీ చేయనున్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News