- Advertisement -
మకస్సార్ (ఇండోనేసియా): ఇండోనేసియా లోని మకస్సార్ చర్చి బయట ఆదివారం ఉదయం ఆత్మాహుతి బాంబు దాడికి 14 మంది గాయపడ్డారు. ఆదివారం రోజు చర్చికి పెద్ద ఎత్తున ప్రార్థనల కోసం జనం వచ్చిన సమయంలో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వారు ఇద్దరు కాగా, వారిలో ఒకరు మహిళగా పోలీసులు చెబుతున్నారు. ఆగంతకులు ఇద్దరు మోటార్ బైక్పై భవనం లోకి ప్రవేశించబోతుండగా సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో తక్షణం వారు తమంతట తాము పేల్చుకుని చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. చర్చికి వచ్చిన వారితోపాటు నలుగురు సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారు. గత ఏడాది డిసెంబర్లో ఆగ్నేయాసియా ఉగ్రవాద గ్రూపు నాయకుడు జెమా ఇస్లామియాను అరెస్టు చేయడమే ఈ దాడికి కారణంగా అనుమానిస్తున్నారు.
14 injured in Indonesia church bombing
- Advertisement -