- Advertisement -
కాంగో: ఆఫ్రికాలోని కాంగోలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి ఇళ్లపై పడడడంతో ప్రాణనష్టం జరుగుతోంది. తూర్పు కాంగోలోని బుకావు నగరంలో కుండపోత వానల కారణంగా ఇళ్లు, ఆస్పత్రులు, పాఠశాలలను వరదలు ముంచెత్తాయి. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతుండడంతో ఇళ్లు ధ్వంసమవుతున్నాయి.
కొండచరియలు విరిగిపడి దాదాపు 14మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మరి కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది సంఘటనాస్థలాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి బయటికి తీసుకొస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే చికి్త్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
- Advertisement -