Wednesday, January 22, 2025

లోయలో పడిన వాహనం: 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -
14 killed as vehicle plunges into valley
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఒక వివాహ వేడుకలో పాల్గొని తిరిగివస్తున్న ప్రయాణికుల వాహనం అదుపు తప్పి లోయలో పడిపోగా 14 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సుఖీధంగ్-దండమినార్ రోడ్డులో సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సమాచారం అందగా పోలీసులు, సహాయక బృందాలు ప్రమాద స్థలికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 12 మృతదేహాలను వెలికితీశామని, మరో రెండు మృతదేహాలు ఇరుకైన ప్రదేశంలో ఉండడంతో వాటిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని చంపావత్ ఎస్‌పి దేవేంద్ర పింఛ తెలిపారు. మృతులలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆయన చెప్పారు. గాయపడిన వారిని తనకఫూర్, చంపావత్‌లోని ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందచేస్తున్నామని ఆయన తెలిపారు. తనక్‌పూర్‌లోని ధర్మశాలలో ఒక పెళ్లికి హాజరైన వీరంతా దందా కాక్నయి గ్రామానికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌పి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News