- Advertisement -
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీలో శనివారం భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది చనిపోగా, పదిమందికిపైగా శిథిలాల కింద చిక్కుకున్నట్టు చెబుతున్నారు. మురికి కాలువపై ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్లైన్ పేలడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్టుగా భావిస్తున్నారు. అయితే, బాంబు డిస్పోజల్ స్కాడ్ను కూడా పాక్ అధికారులు ఘటనా స్థలానికి పంపారు. శిథిలాలలను తొలగించే ప్రత్యేక బృందాన్ని కూడా అక్కడికి పంపారు. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ బ్యాంక్ పూర్తిగా ధ్వంసమైంది. బాధితుల్లో ఎక్కువభాగం బ్యాంక్ సిబ్బంది, వినియోగదారులేనని స్థానిక మీడియా తెలిపింది.
- Advertisement -