Monday, January 20, 2025

పెరూ, ఈక్వెడర్‌లో భూకంపం: 14 మంది మృతి….

- Advertisement -
- Advertisement -

క్విటో: పెరూ, ఈక్వెడర్‌లో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 14 మంది మృతి చెందగా 126 మంది గాయపడ్డారు. ఈక్వెడర్ లో 13 మంది, పెరూలో ఒకరు చనిపోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా ఉందని భూపరిశోధన అధికారులు గుర్తించారు. భూప్రకంపనల ధాటికి ఇండ్లు కుప్పకూలిపోయాయి. భూమి కంపించడంతో ప్రజలు ప్రాణంభయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈక్వెడర్‌లోని కోస్టల్ గౌయక్వాల్ ప్రాంతానికి 80 కిలో మీటర్ల భూకంప కేంద్ర ఉన్నట్టు గుర్తించారు. ఈక్వెడర్‌లో రెండో అతి పెద్ద పట్టణం గౌయక్వాల్ అని, ఈ పట్టణంలో మూడు మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. సునామీ వచ్చే అవకాశాలు లేవని జియోలాజికల్ సర్వే తెలిపింది. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News