Wednesday, January 22, 2025

ఛత్తీస్‌గఢ్‌లో 14 మంది నక్సల్స్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మ జిల్లాలో వేర్వేరు ఆపరేషన్లలో 19 మంది నక్సలైట్లను భద్రతా దళాలు అరెస్టు చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. జగర్‌గుండ పోలీసు స్టేషన్ పరిధిలో 14 మంది నక్సల్స్‌ను అరెస్టు చేయగా భెజ్జీ పోలీసు స్టేషన్ పరిధిలో దివారం ఐదుగురు నక్సలైట్లను అదెస్టు చేసినట్లు ఒక అధికారి చెప్పారు. ఈ రెండు ఆపరేషన్లలో జిల్లా రిజర్వ్ గార్డు, సిఆర్‌పిఎఫ్, కోబ్రా(కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్)కు చెందిన ఉమ్మడి దళాలు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. జగర్‌గుండలో అదుపులోకి తీసుకున్న 14 మంది నక్సల్స్ 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులని, వారిలో ముగ్గురిపై రూ. 1 లక్ష నగదు బహుమతి ఉందని ఆయన తెలిపారు. నక్సల్స్ నుంచి మూడు గెలటిన్ రాడ్లు, 300 గ్రాముల గన్‌పౌడర్, కార్డెక్స్ వైర్, టపాసులు, డిటొనేటర్లు, ఎలెక్ట్రిక్ వైర్, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు ఆ అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News