Monday, December 23, 2024

వేగాస్ హుక్కా పార్లర్‌లో 14 మందిపై కాల్పులు

- Advertisement -
- Advertisement -
14 shot 1 killed at hookah bar
ఒకరు మృతి, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు

లాస్ వేగాస్: ఇక్కడి ఓ హుక్కా పార్లర్‌లో 14 మందిపై కాల్పులు చోటుచేసుకున్నాయి. వారిలో ఒకరు చనిపోగా, మరి ఇద్దరు తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఓ పార్టీ జరుగుతుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తర్వాత తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయి. అనేక మందిపై కాల్పులు జరిగాయని పోలీస్ కెప్టెన్ డోరి కొరేన్ తెలిపారు. ఇంత వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అనుమానితుల వివరాలు కూడా లభించలేదని, అయితే సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. ఇదిలావుండగా ఈ సంఘటనలో ఉపయోగించిన తుపాకులు ఏ రకానికి చెందినవనే విషయాన్ని గుర్తించేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారికి అధికారులు వైద్య సాయం అందించారు. కాల్పుల అనంతరం ఆ ప్రదేశాన్ని పోలీసులు దిగ్భందించారు. తూటాలు, ఇతర సాక్షాధారాల కోసం పోలీసు అధికారులు అన్వేషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News