Sunday, November 17, 2024

సస్పెండ్ అయిన 14 మంది ఎంపీలు మళ్లీ పార్లమెంట్‌కు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత పార్లమెంట్ సమావేశాల్లో సస్పెండ్ అయిన 14 మంది ఎంపీలు మళ్లీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం విలేఖరులకు వెల్లడించారు. బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. “ తాము ప్రభుత్వం తరఫున స్పీకర్‌ను, ఛైర్‌పర్శన్‌ను అభ్యర్థించామని, వారు అందుకు అంగీకరించారని ఆయా ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తివేయడమౌతుందని జోషి వివరించారు. శీతాకాల సమావేశాల్లో తమ ప్రవర్తనకు

విచారం వ్యక్తం చేసిన తరువాత లోక్‌సభ, రాజ్యసభ కమిటీలు సస్పెన్షన్ ఎత్తివేయాలని సిపార్సు చేశాయని చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లోకి ప్లకార్డులు ప్రదర్శించడమే కాక, తరచుగా పదేపదే సభాకార్యకలాపాలకు అంతరాయం కలిగించారన్న ఆరోపణలపై విపక్షాలకు చెందిన మొత్తం 140మంది ఎంపిలను సస్పెండ్ చేయడమైంది. మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎంపీలు ఎలాంటి ప్లకార్డులు ప్రదర్శించరాదని, అలాంటి వస్తువులు ఏవీ తీసుకు రాకూడదని , అలా చేస్తే ఉభయ సభల అధ్యక్షులు తీవ్ర చర్యలు తీసుకుంటారని వివరించడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News