Saturday, December 21, 2024

14 నుంచి లాసెట్ కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు నిర్వహించనున్న టిఎస్‌లాసెట్, పిజిఎల్ సెల్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో జరిగిన లాసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు.ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. సమావేశంలో విద్యామండలి వైఎస్ చైర్మన్లు ఎస్‌కె మహమూద్, వి.వెంకటరమణ, కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు, ప్రవేశాల కమిటీ కన్వీనర్ పి.రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
టిఎస్ లాసెట్ 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్
లాసెట్, పిజిఎల్‌సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 14 నుంచి -21 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అర్హత పొందిన అభ్యర్థులు ఈ నెల 23, 24న వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఈ నెల 28న మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 29 నుంచి డిసెంబరు 2 వరకు ఫీజు చెల్లించి, ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనకు కళాశాలల్లో రిపోర్టింగ్ రిపోర్టింగ్ చేయాలి. డిసెంబరు 4న తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడేళ్ల ఎల్‌ఎల్‌బికి 20,234 మంది అర్హత సాధించగా, 22 కాలేజీల్లో 4,790 సీట్లు అందుబాటులో ఉండగా, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బికి 6,039 మంది అర్హత సాధించగా, 19 కాలేజీల్లో 2,280 సీట్లు అందుబాటులో ఉన్నాయి.అలాగే పిజిఎల్‌సెట్‌కు 2,776 మంది అర్హత సాధించగా, 17 కాలేజీల్లో 930 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News