Monday, December 23, 2024

తెలుగు రాష్ట్రాలకు 14 మంది ట్రైనీ ఐపిఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌విపిఎన్‌పిఎ)లో 75వ బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) ప్రొబేషనర్ల పాసింగ్-అవుట్ పరేడ్‌ను శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. ట్రైనీ ఐపిఎస్ ల గౌరవ వందనాన్ని అమిత్ షా స్వీకరించారు. టాపర్ గా నిలిచిన కాలియాకు అమిత్ షా బహుమతి ప్రదానం చేశారు. 175 మంది టైనీ ఐపిఎస్ లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు 14 మంది ట్రైనీ ఐపిఎస్ లు కేటాయించారు. చట్టబభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించాయని అమిత్ షా తెలిపారు. కర్తవ్య నిర్వహణలో అమరవీరుల బలిదానం ప్రేరణ కవాలని పిలుపునిచ్చారు.

వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సవాళ్లు విసురుతున్నాయి. క్రిప్టో కరెన్సీ దేశ ఆర్థికవ్యవస్థ బలహీనానికి యత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్టంగా పోరాడాలన్నారు. ఆంగ్లేయుల కాలం నాటి 3 చట్టాలను మార్చాల్సిఉంది. సిఆర్ పిసి, ఐపిసి, ఎడిడెన్స్ చట్టాల్లో మార్పులు చేయాల్సిఉందన్నారు. మూడు చట్టాల్లో మార్పులు చేసి ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచింది. త్వరలో నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతోందన్నారు. శాసనాలను సురక్షితంగా ఉంచడమే పాత చట్టాల ఉద్దేశంగా ఉండేదన్నారు. ప్రజల అధికారాలను సురక్షితంగా ఉంచడం కొత్త చట్టాల ఉద్దేశం అని ఆయన వివరించారు. కొత్త చట్టాల ఆధారంగా అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాలని అమిత్ షా సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News