Monday, December 23, 2024

చైనాలో బొగ్గు గని కూలి 14 మంది కార్మికులు మృతి

- Advertisement -
- Advertisement -

14 workers dead in China coal mine collapse

 

బీజింగ్: పది రోజుల క్రిందట నైరుతి చైనాలోని బొగ్గు గనిలో చిక్కుకుపోయిన 14 మంది కార్మికులు మరణించినట్లు అక్కడి మీడియా ఆదివారం తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం చేపట్టిన రెస్కూ ఆపరేషన్‌లో ఆ గని కార్మికుల మృత దేహాలను వెళికి తీశారని చైనా ప్రభుత్వ ‘జిన్హువా’ వార్తా సంస్థ తెలిపింది. గుయిజౌలోని సన్హే షున్‌గ్జున్ బొగ్గు గనిలో ఫిబ్రవరి 25న షాఫ్ట్ పైకప్పు కూలడంతో వారు అందులో చిక్కుకుపోయారు. గని ప్రవేశ ద్వారం నుంచి కూలిన ఆ పైకప్పు దాదాపు 3 కిమీ. (1.9 మైళ్లు) దూరంలో ఉండడంతో కాపాడే చర్య ఛాలెంజ్‌గా మారింది. కూలిన ఆ గని కూడా చాలా ప్రదేశాన్ని ఆక్రమించుకుంది. ఇదిలావుండగా ఆ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. చైనాలోని బొగ్గు గనులు ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైనవని, తరచూ అక్కడ ప్రమాదాలు సంభవిస్తుంటాయని తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News