Monday, December 23, 2024

యూపీలో దళిత బాలునిపై దాడి..

- Advertisement -
- Advertisement -

జయున్‌పూర్ (యూపీ) : ఉత్తరప్రదేశ్ లోని సుజన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఒక గ్రామంలో 14 ఏళ్ల దళిత బాలునిపై కొందరు దాడి చేయడమే కాక, మూత్రం తాగాలని బలవంతం చేశారని పోలీస్‌లకు ఫిర్యాదు అందింది. బాధితుని తండ్రి శుక్రవారం తమకు ఫిర్యాదు చేశారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రోహిత్ కుమార్ మిశ్రా వెల్లడించారు. అంతకు ముందు రోజు గ్రామం లోని కొందరు తన కుమారుడిని కొట్టారని, మూత్రం తాగాలని ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదు చేసినట్టు మిశ్రా వెల్లడించారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో మూత్రం తాగాలని ఒత్తిడి తీసుకురావడం వాస్తవం కాదని తేలిందన్నారు.

ఒక కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై బాధితుడు అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని దర్యాప్తులో బయటపడిందన్నారు. ఈలోగా నిందితుల్లో ఒకరి నుంచి ఫిర్యాదు అందిందన్నారు. బాధితుడు తన స్నేహితులతో కలిసి తమ మైనర్ కుమార్తెపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై దళిత బాలునిపైన, అతని స్నేహితుని పైన ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్టు పోలీస్ ఆఫీసర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News