Monday, January 20, 2025

దళిత బాలికపై సామూహిక అత్యాచారం.. హత్య

- Advertisement -
- Advertisement -

మథుర: ఉత్తర్ ప్రదేశ్‌లోని మథుర జిల్లా మహావన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఒక 14 ఏళ్ల దళిత మైనర్ బాలికపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం గొంతు పిసికి చంపివేశారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆ బాలిక తన తొమ్మిదేళ్ల సోదరిని వెంటపెట్టుకుని బహిరూమి నిమిత్తం తన ఇంటి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లినపుడు ఈ దారునం సంభవించింది.

అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత గొంతుపిసికి చంపివేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి తప్పించుకు పారిపోయిన ఆ బాలిక చెల్లెలు ఈ సంఘటన గురించి తన తల్లిదండ్రులకు తెలియచేయగా వెంటనే వారితోపాటు గ్రామస్తులు అడవిలో గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలం వద్ద ఇద్దరు యువకులను వారు నిర్బంధించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మూడవ నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News