Sunday, December 22, 2024

గుండెపోటుతో 14 ఏళ్ల విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

కరోనా తర్వాత గుండెపోటుతో చనిపోయేవారి మరణాలు ఎక్కువయ్యాయి. గతంలో పెద్ద వయసు ఉన్నవారికి ఎక్కువగా గుండె పోటు వస్తుండేది. కానీ, పరిస్థితి మారింది. టీనేజ్ పిల్లలు కూడా గుండెపోటుతో మృతి చెందుతున్నారు. తాజాగా 14 ఏళ్ల ఓ విద్యార్థి మృతి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

కందికట్కూర్ గ్రామనికి చెందిన సాయితేజ(14) అనే విద్యార్థి గుండె పోటుతో పాఠశాలలోనే కుప్పకూలి చనిపోయాడు. దీంతో పాఠశాలతోపాటు గ్రామంలో విషాదం నెలకొంది. సాయితేజకు పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉందని.. ఆపరేషన్ తప్పనిసరిగా చేయించాలని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, డబ్బులు లేక తల్లిదండ్రులు ఆపరేషన్ చేయించలేకపోయారని… ఈ క్రమంలో మంగళవారం బడికి వెళ్లిన సాయితేజ.. గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News