Wednesday, January 22, 2025

బీజేపీకి 140 స్థానాలు: కేఎస్ ఈశ్వరప్ప

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ తమ పార్టీకి సుమారు 140 స్థానాలు లభిస్తాయని చెప్పారు. ఓటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, బీజేపీకి సంపూర్ణ మద్దతు లభిస్తుందని తెలిపారు. కాంగ్రెస్, జేడీఎస్ ముస్లింలను మచ్చిక చేసుకుని బుజ్జగించడానికి ప్రయత్నించాయన్నారు. పిఎఫ్‌ఐ వంటి దేశ వ్యతిరేక సంస్థలకు మద్దతు ఇచ్చే వారు కాంగ్రెస్ వెంట ఉన్నారన్నారు. ఈశ్వరప్ప శివమొగ్గలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపి తేజస్వి సూర్య బెంగళూరు లో తన ఓటు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News