‘లాంచ్‌ప్యాడ్’ల వద్ద 140 మంది ఉగ్రవాదులు
కశ్మీర్‌లోకి చొరబడేందుకు వారు ప్రయత్నిస్తున్నారు
అయితే మన సైన్యం వారి కుతంత్రాలను సాగనివ్వడం లేదు
కాల్పుల విరమణ ఉన్నా పాక్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద శిబిరాలు
ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడి
శ్రీనగర్: దాదాపు 140 మంది ఉగ్రవాదులు జమ్మూ, కశ్మీర్‌లో చొరబడడానికి సరిహద్దు అవలి వైపున ఉన్న లాంచ్‌ప్యాడ్‌ల వద్ద వేచి చూస్తున్నారని, భారత్, పాకిస్థాన్‌లు గత ఫిబ్రవరిలో కాల్పులవిరమణకు అంగీకరించినప్పటికీ అధీన రేఖ వెంబడి ఉగ్వాద ఉగ్రవాద శిక్షణా స్థావరాలు ఇప్పటికీ యధావిధిగా కొనసాగుతున్నాయని భద్రతా దళాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందం భారత్‌కంటే పాకిస్థ్థాన్‌కు చాలా ముఖ్యమని, ఎందుకంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఎటిఎఫ్) గ్రే లిస్టు జాబితా నుంచి బైటపడడానికి అది ప్రయత్నిస్తోందని ఆయన అంటూ, సాకిస్థాన్ గనుక సనిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలను గనుక తొలగిస్తే దాని నిజాయితీని అంచనా వేయడానికి వీలవుతుందని అన్నారు. అయితే జమ్మూ, కశ్మీర్‌లోకి చొరబడడం కోసం అధీన రేఖ వెంబడి లాంచ్‌ప్యాడ్‌ల వద్ద దాదాపు 140 మంది ఉగ్రవాదులు ఉన్న విషయాన్ని సైన్యం గమనిస్తూనే ఉందని, పటిష్ఠమైన చొరబాట్ల నిరోధక భద్రతా వ్యవస్థ కారణంగా వారు ఆ సాహసం చేయలేకపోతున్నారని ఆయన చెప్పారు. జమ్మూ, కశ్మీర్‌లోకి చొరబడడానికి గతంలో వారు ప్రయత్నించారు కానీ అప్రమత్తంగా ఉన్న జవాన్లు వారి కుటిల యత్నాలను భగ్నం చేయడంతో వెనుదిరిగారని ఆ అధికారి చెప్పారు. గత ఏడాది అధీన రేఖ వెంబడి పౌర నివాస ప్రాంతాలపై పాక్ సైన్యాల కాల్పులు, శతఘ్ని దాడుల కారణంగా మన సైన్యం జరిపిన దాడుల్లో ధ్వంసమైన తమ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవడానికి సాక్ కాల్పుల విరమణను ఒక అవకాశంగా ఉపయోగించుకుంటోందని ఆయన చెప్పారు.
రెండేళ్ల క్రితం కేంద్రం జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితిపై మాట్లాడుతూ, ఒక్కసారిగా విదేశీ టెర్రరిస్టులు మాయమైపోయారని, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కానీ, సహజ గుహలు ఉండే ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో కానీ దాక్కొని ఉండవచ్చని ఆ అధికారి చెప్పారు. కాగా స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరడం గురించి మాట్లాడుతూ, ఆయుధాలు ధరించడం లేదా, దేశానికి వ్యతిరేకంగా కుట్రపూరిత కార్యకలాపాల్లో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్న వారు అలాంటి ఆలోచనలు మానుకోవాలని, అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచి వేస్తామనే సందేశాన్ని నిరంతరం ఇస్తూనే ఉన్నామని కూడా ఆ అధికారి చెప్పారు. ఇది సత్ఫలితాలను ఇచ్చిందని కూడా ఆయన చెప్పారు.
140 terrorists waiting at launch pads across LoC