- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో తాజాగా 14,092 కేసులు నమోదయ్యయి. దీంతో మొత్తం కరోనా కేసులు 4,42,53,464కు చేరాయి. ఇందులో 4,36,09,566 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,27,037 మంది బాధితులు మృతిచెందారు. మరో 1,16,861 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల 41 మంది మరణించగా, 16,454 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా కేసులు తగ్గుతుండటంతో పాజిటివిటీ రేటు కూడా పడిపోతున్నది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 4.36 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక 0.26 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని వెల్లడించింది.
- Advertisement -