Tuesday, November 5, 2024

గాజాలో ఇజ్రాయెల్ దాడులకు 142 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గాజాలో ఇజ్రాయెల్ దాడులకు గత 48 గంటల్లో 142 మంది మృతి చెందారని పాలస్తీనియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 150 మంది గాయపడ్డారు. దీంతో గాజాలో పాలస్తీనియన్ల మృతుల సంఖ్య మొత్తం 39.897కు పెరిగిందని , మొత్తం 92,000 గాయపడ్డారని సోమవారం ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై ఆకస్మికంగా గత అక్టోబర్ 7న హమాస్ దాడికి పాల్పడినప్పుడు పాలస్తీనియా మిలిటెంట్లు 1200 మందిని మట్టుబెట్టారు. మృతుల్లో చాలా మంది పౌరులు ఉన్నారు. దాదాపు 250 మందిని బందీ చేశారు. వీరిలో చాలామందిని గత నవంబర్‌లో యుద్ధం ఆగినసమయంలో విడుదల చేయగా, ఇంకా 110 మంది గాజాలో బందీలుగా ఉన్నారు. వీరిలో మూడో వంతు మంది చనిపోయి ఉంటారని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది.

దక్షిణ గాజా ఆస్పత్రికి 13 మృతదేహాలు
ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ దాడికి మృతి చెందిన వారిలో 13 మృతదేహాలను దక్షిణ గాజా ఆస్పత్రి స్వాధీనం చేసుకుంది. పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్ల దాడి ముమ్మరం చేస్తుండటంతో గాజాలోని రెండో పెద్ద నగరం ఖాన్ యూనిస్‌లో భారీ ఎత్తున ప్రజలను ఖాళీ చేయించవలసి వస్తోందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో ఇజ్రాయెల్ వాయు, పదాతి సేనల దాడులకు ఖాన్‌యూనిస్ విధ్వంసం అయింది.

గాజాకు సహాయం అడ్డు కోవడంపై ఐరోపా తీవ్ర ఆందోళన
గాజాకు సహాయంలో కోత తగ్గించాలని ఇజ్రాయెల్ అతివాద జాతీయ భద్రతా మంత్రి పిలుపు ఇవ్వడంపై ఐరోపా యూనియన్ అగ్ర దౌత్యవేత్త ఆందోళన వెలిబుచ్చారు. యుద్ధాన్ని ఆపడానికి అంగీకరించడానికి బదులు మానవతా సహాయాన్ని గాజాకు అందకుండా అడ్డుకోవడంపై ఐరోపా యూనియన్ విదేశాంగ విధానం చీఫ్ జోసెఫ్ బోరెల్ తీవ్రంగా విమర్శించారు.హమాస్ బందీలందర్నీ పూర్తిగా విడిచిపెట్టేవరకు ఎలాంటి సాయం గాజాకు అందరాదని ఇజ్రాయెల్ ఆంక్షలు విధించడాన్ని తప్పు పట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News