Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో రూ.14.34 కోట్ల నగదు సీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు రోజువారిగా నిర్వహిస్తున్న తనిఖీల్లో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.14,34,61,890 నగదుతో పాటు రూ. 2 ,1, 82, 485ల విలువగల ఇతర వస్తువులు, 20,767.52 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ తెలిపారు. అదేవిధంగా 195 మందిపై కేసులు నమోదు చేయడంతోపాటు 192 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువుల పై 396 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించారని, 261 మంది పై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయడంతో పాటు 2,877 లైసెన్సు గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్టు రోనాల్ రోస్ తెలిపారు.

బుధవారం ఉదయం 6 గంటల నుండి గురువారం ఉదయం ఆరు గంటల వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో రూ. 2,96,350- నగదు, రూ.1,69,397ల విలువైన ఇతర వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లుఆయన వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 325.63 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, 10 కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు ఇతర వస్తువులపై 13 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని, 10ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. 35 లైసెనస్డ్ ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా రూ. 3,06,54,220ల పోలీస్,ఐటి శాఖ ద్వారా రూ.11,12,27,980ల ఎస్ ఎస్ టి బృందాల ద్వారా రూ.15,79,690- నగదు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News