- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 62,856 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1439 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా వెల్లడించింది. కొత్తగా 14 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రం మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 2026042కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,963కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,311మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1997454 మంది బాధితరులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,624 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.
1439 New Corona Cases Report in AP
- Advertisement -