Monday, January 6, 2025

144 మంది అభ్యర్థుల చేతిలో నీట్ ప్రశ్నాపత్రం

- Advertisement -
- Advertisement -

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) యుజి 2024 జరగడానికి కొన్ని గంటల ముందు మొత్తం 144 మంది అభ్యర్థులు ప్రశ్నాపత్రాన్ని అందుకున్నారని సిబిఐ గుర్తించింది. వీరంతా ల్రీకేజీ సూత్రధారులకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించారని సిబిఐ తెలిపింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూలు ప్రిన్సిపాల్ అభసనుల్ హఖ్, వైస్ ప్రిన్సిపాల్ మొహమ్మద్ ఇంతియాజ్ ఆలంతో కుమ్మక్కైన పంకజ్ కుమార్ నీట్ ప్రశ్నాపత్రాన్ని స్కూలు నుంచి చోరీ చేశాడని గత వారం దాఖలు చేసిన తన మూడవ చార్జిషీట్‌లో సిబిఐ తెలిపింది. పరీక్ష జరిగిన మే 5వ తేదీ ఉదయం 8 గంటల తర్వాత స్కూలులో భద్రపరిచిన ట్రంకు పెట్టెల నుంచి ప్రశ్నాపత్రాన్ని చోరీ చేసినట్లు సిబిఐ తెలిపింది.

నీట్ యుజి 2024 పరీక్ష నిర్వహణ కోసం హజారీబాగ్ నగర ఏకైక కోఆర్డినేటర్‌గా హఖ్ నియమితుడయ్యారని, ఆలంను సెంటర్ సూపరింటెండెంట్‌గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమించిందని సిబిఐ పేర్కొంది. 298 మంది సాక్షులు, 290 పత్రాలు, 45 వస్తు సాక్ష్యాధారాల ఆధారంగా 5,500 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసిన సిబిఐ పేపర్ లీక్ జరిగిన తీరును సమగ్రంగా వివరించింది. ఈ పేపర్ లీక్ ద్వారా 144 మంది అభ్యర్థులు ప్రయోజనం పొందారని, వారిపిఐ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని సిబిఐ పేర్కొంది. ఈ కేసులో ఉపయోగించిన 21 మొబైల్ ఫోన్లను వివిధ నీట వనరుల నుంచి స్వాధీనం చేసుకున్నామని, కుట్రదారులతోసహా మొత్తం 49 మంది నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేశామని సిబిఐ తన చార్జిషీట్‌లో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News