- Advertisement -
కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించడం సహా పలు తమ డిమాండ్ల సాధనకోసం పంజాబ్ రైతులు మరోసారి నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి నిరసన చేపట్టాలని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్రం ఇప్పటికే కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. ఢిల్లీ వ్యాప్తంగా ఈరోజు 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. అత్యవసరమయితే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రజలు ప్రయాణించవద్దని సూచించారు. ఇక, ఢిల్లీ సరిహద్దు రహదారులన్నింటినీ భారీ కేడ్లు, ముళ్ల కంచెలతో మూసివేసింది.
రహదారిపై ఇసుక సంచులు, కాంక్రీట్ దిమ్మెలను అడ్డుగా ఉంచారు. రోడ్లపై పదునైన ఇనుప మేకులను అమర్చారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలను సైతం మోహరించారు. రాఫ్ దళాలతో సహా మూడంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు.
- Advertisement -