Thursday, January 23, 2025

పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ఫిబ్రవరి 22 నుండి 28 వరకు డిఈడి మొదటి సంవత్సరం పరీక్షలు సిద్దిపేట ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ కేంద్రంలో ఉన్నందున పరీక్ష కేంద్రం వద్ద సీఆర్పిసి 144 సెక్షన్ విధించినట్లు సీపీ శ్వేత తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఈ నెల 22 నుండి 28వ వరకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రం నుండి సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలన్నారు. పరీక్ష సెంటర్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్షలకు భద్రతా ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ అధికారులు పరీక్ష సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News