- Advertisement -
అమరావతి: మంటల్లో ధ్వంసమైన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటిని పరిశీలించారు. కక్ష సాధింపులతోనే దాడులు చేశారని మంత్రి విశ్వరూప్ మండిపడ్డారు. అందరూ సంయమనం పాటించాలన్నారు. కోన సీమ సాధన సమితి కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండదన్నారు. నిరసన కారులను తన ఇంటి వైపు దారి మళ్లించారని మండిపడ్డారు. కార్యకర్తలను కంట్రోల్ చేయడంలో టిడిపి, జనసేన విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కారుల ఆందోళనల్లో రౌడీ షీటర్లు చొరబడ్డారన్నారు. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఇటీవల ప్రభుత్వం మార్చడంతోనే అల్లర్లు చెలరేగాయి. జిల్లా పేరును మార్చొద్దంటూ గతకొంతకాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో మంత్రి ఇళ్లుతో పలు బస్సులను తగలబెట్టిన విషయం తెలిసిందే.
- Advertisement -