- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ తాజాగా 14 వేల మందికి సోకగా, బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది. మంగళవారం 4.33 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 14,506 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందు రోజు ఆ సంఖ్య 11,793 గా ఉంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.35 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో 2020 ప్రారంభం నుంచి 4.34 కోట్ల మందికి కరోనా సోకగా, 5.25 లక్షల మందికి పైగా మృతి చెందారు. ప్రస్తుత వ్యాప్తి ప్రభావం క్రియాశీల కేసులపై కనిపిస్తోంది. వాటి సంఖ్య (వైరస్ బాధితులు) 99,602 (0.23 శాతం) కి చేరి, ఆందోళన కలిగిస్తోంది. రికవరీ రేటు 98.56 శాతానికి పడిపోయింది. మంగళవారం 11,574 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 197 కోట్లకు పైగా డోసుల పంపిణీ కాగా, అందులో 13.44 లక్షల మంది మంగళవారం టీకా తీసుకున్నారు.
- Advertisement -