Monday, December 23, 2024

1472 ఐఎఎస్, 864 ఐపిఎస్ పోస్టులు ఖాళీ

- Advertisement -
- Advertisement -

1472 IAS 864 IPS posts are vacant

ఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో ఈ ఏడాది జనవరి నాటికి 1472 ఐఏఎస్, 864 ఐపిఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. అధికారుల కొరతను అధిగమించేందుకు బస్వాన్ కమిటీ సిఫారసులను అమలుచేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా సివిల్స్ ద్వారా ఏటా ఎంపిక చేసుకునే ఐపిఎస్ ల సంఖ్యను 200కి, ఐఎఎస్ ల సంఖ్యను 180కి పెంచామని పేర్కొన్నారు. అంతకు మించి తీసుకుంటే నాణ్యతతో రాజీపడినట్లు అవుతుందని కమిటీ చెప్పిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News