- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24గంటల్లో 149 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో కరోనాతో ఒకరు మృతి చెందగా, 186 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,831కి పెరిగింది. ఇప్పటివరకు 2,92,415 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,612 మంది కోవిడ్-19 తో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ప్రస్తుతం 1,804 యాక్టివ్ కేసులున్నాయి. అందులో 694 మంది హోంఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల్లో 31,834 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 25 మందికి కరోనా మహమ్మారి సోకింది.
149 New Covid-19 Cases Reported in Telangana
- Advertisement -